ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..

ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..

ఖమ్మం బ్యూరో,డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)

తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన భూక్య వీరస్వామి కుటుంబానికి ఏఐటియుసి ఆధ్వర్యంలోని భవన నిర్మాణ కార్మికులు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన ఏఐటియుసి నాయకులు, కార్మికుల సహకారంతో రూ.7 వేల నగదు సేకరించి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ.. భూక్య వీరస్వామి మృతి కార్మిక లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని, ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా కార్మిక కుటుంబాలకు ఏఐటియుసి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు, ఏఐటియుసి నాయకులు పాల్గొని భూక్య వీరస్వామి కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించారు. కార్మికుల ఐక్యతతోనే ఇలాంటి సహాయ కార్యక్రమాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు. కష్టకాలంలో కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించడమే ఏఐటియుసి లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగట్టు సామెలు, నల్లగట్టు రవి, నల్లగట్టు జనర్ధన్, కొంగల రవి, మందుల శ్రీను, నల్లగట్టు ఇదయ్య, నల్లగట్టు శ్రీను(పిరయ్య ), నల్లగట్టు శ్రీను( ఎర్ర ), నల్లగట్టు సురేష్, నల్లగట్టు కిరణ్, నల్లగట్టు వెంకన్న, దోసపాటి మైసయ్య, ఇరుగు కృష్ణ, నల్లగట్టు అంబేద్కర్, నల్లగట్టు సామ్రాట్, మేడి వెంకటేష్, భానోత్ మంగు (రేకుల తండా ), నకిరేకంటి సుధాకర్, నల్లగట్టు నాగేష్(మలక ), నల్లగట్టు నాగార్జున్, నల్లగట్టు నాగన్న, చిలక సత్యం, నల్లగట్టు లింగయ్య తదితరులు పాల్గొన్నారు..

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .