శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
-హతీరామ్ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలి
-కేంద్రాన్ని కోరిన ఎంపీల బృందం
న్యూ ఢిల్లీ,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
లోక్‌సభ భవనంలో కేంద్ర సంస్కృతి శాఖ మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించిన అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆచార్య అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, జీ నాగేష్ పార్లమెంట్ సభ్యులతో కలిసి శ్రీ హతీరామ్ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మఠానికి స్పష్టమైన పరిపాలనా వ్యవస్థ ఏర్పడితే సంప్రదాయాల పరిరక్షణతో పాటు భక్తుల విశ్వాసానికి భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారిక జయంతిగా ప్రకటించి దేశవ్యాప్తంగా నిర్వహించాలని వినతిపత్రంలో డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ జయంతి అధికారికంగానిర్వహించటం ద్వారా ఆయన సేవలు, బోధనలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు చేరువవుతాయని తెలిపారు.
ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments