శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు చేరుకున్న  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు చేరుకున్న  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతిని ఆహ్వానించారు.అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముందుగానే హకీంపేటకు విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావులకు జిల్లా కలెక్టర్మను చౌదరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. IMG-20251217-WA0073ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్