దేశానికి బౌధ్దమే శరణ్యం.

దేశానికి బౌధ్దమే శరణ్యం.

దేశానికి బౌధ్దమే శరణ్యం.

కులాన్ని కుకటి వెళ్లతో పెకిలించాలి.

మనువాధుల చెర నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.

ఘనంగా బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు.

హసన్‌పర్తి,డిసెంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):

ప్రపంచ మేధావి,నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్  69వ వర్ధంతి దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో దేవన్నపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈదేశానికి బౌధ్దమే ఏకైక మార్గమని కులనిర్మూలనను కుకటి వెళ్ళతో పెకిలించాలని,మనువాధుల చెరనుండి భారత రాజ్యాంగాన్ని రక్చించుకోని,అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు  చుంచు రాజేందర్  పిలుపునిచ్చారు.
శనివారం రోజున హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డిబిఎఫ్ ఆద్వర్యంలో 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చుంచు రాజేందర్ మాట్లాడుతూ
ప్రపంచ మేధావి,భారత దేశ రాజ్యాంగ నిర్మాత,స్త్రీల హక్కుల కోసం మంత్రి పదవిని సైతం వదిలిన దిశాలి అంబేద్కర్ అని కొనియాడారు.ప్రముఖ భారతీయ న్యాయవాది,ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ నేత,సంఘ సంస్కర్త.అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడన్నారు.స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సి,మైనారిటీ,ఒసి సబండ వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయులు అంబేద్కర్ అని అన్నారు.ఈరోజు అంబేద్కర్ పరమాపదించిన రోజు అంటే మూలవాసులైన ప్రజలు అంధకారంలోకి వెళ్లిన రోజని ఆవేదన వ్యక్తం చేశారు.మను వాధుల చేతుల్లో నుండి  భారత రాజ్యాంగానీ రక్షించుకోవడమే అంబేద్కర్ కు అసలైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి పిఎసిఎస్ డైరెక్టర్ చుంచు విజేందర్,కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎస్సీ సెల్ చైర్మన్ నందిపాక బాస్కర్,డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్,ప్రముఖ న్యాయవాది బచ్చలికూర సారంగపాణి,బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చుంచు ఎల్లయ్య,రజక సంఘం నాయకులు పొలేపల్లి సదానందం,65 వ డివిజన్ డిబిఎఫ్ అధ్యక్షుడు ఇసంపల్లి కిరణ్,చుంచు కృష్ణ,కాగితోజు విశ్వనాథ్, పొలేపల్లి బీమయ్య,కరుణాకర్,సాంబయ్య,రాజు,కిష్టయ్య,
సంపత్,వేంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ