నాగారంలో క్రిస్మస్ వేడుకలు 

నాగారంలో క్రిస్మస్ వేడుకలు 

నాగారం, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపల్ స్టార్ ఫంక్షన్ హాల్‌లో కీసర మండల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వేడుకలో పాల్గొన్న వజ్రెష్ యాదవ్  క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ ప్రేమ, సౌహార్దం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, దమ్మైయిగూడ మున్సిపల్ అధ్యక్షులు రామరావు, మాజీ వైస్‌చైర్మన్ మల్లేశ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు హరిబాబు, వెంకట్ రెడ్డి, పంభాల రమేష్, యాదగిరి గౌడ్, సత్తిష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి, పొట్ట శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.అలాగే పాస్టర్లు, విశ్వాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ