ఆదరించండి..కన్మనూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మానస రవి
అడ్డాకల్,డిసెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
అడ్డాకల్ మండలం కన్మనూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానస రవి అన్నారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మానస రవి మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, శుద్ధి నీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పల్లె ప్రకృతి వనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళల అభివృద్ధికి స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడం తన లక్ష్యమన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగునీటి వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి సహకారంతోనే సాధ్యమని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో పాటు ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లెల చిన్నారెడ్డి ఆశీస్సులతో విజయం సాధించి కన్మనూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మానస రవి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తానన్నారు. నేడు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రింగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు. తనకు ఒక అవకాశం ఇస్తే మాటలకే కాదు, పనులతోనే అభివృద్ధిని చూపిస్తానని అన్నారు.


Comments