16వ డివిజన్‌కు కుషాయిగూడ పేరు పెట్టాలి
జోనల్ కమిషనర్‌కు అభ్యంతర పత్రం సమర్పించిన కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్
కుషాయిగూడ, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు) :
16వ డివిజన్‌కు “కుషాయిగూడ” అనే పేరు కొనసాగించాలని కోరుతూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయంలో అభ్యంతర పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ నాయకత్వం వహించారు.
ఈ అభ్యంతరానికి మద్దతుగా సీసీఎస్ అధ్యక్షులు, శివసాయి నగర్ కాలనీ అధ్యక్షులు వెంపల్లి పద్మారెడ్డి, నాగార్జున నగర్ కాలనీ అధ్యక్షులు యావపురం రవి, సాయినగర్ కాలనీ అధ్యక్షులు సారా వినోద్ ముదిరాజ్, వైష్ణవి ఎంక్లేవ్ అధ్యక్షులు గంప కృష్ణ, ఇంద్రనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు సారా అనిల్ ముదిరాజ్ తదితరులు వారి వారి కాలనీల తరపున అభ్యంతర పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి చిత్తుల కిషోర్ గౌడ్, జాయింట్ సెక్రటరీ నాలచెరువు జనార్దన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిట్ల రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 16వ డివిజన్‌కు కుషాయిగూడ పేరును కొనసాగించాలని వారు అధికారులను కోరారు.


Comments