నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి

నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 

వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

 వనపర్తి నియోజకవర్గం లోని అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా కురుమూర్తి, చిట్టి బాబు ఘన విజయం సాధించిన సందర్భంగా.. వారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు మరియు వార్డు సభ్యులను డా. చిన్నారెడ్డి  శాలువాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల మద్దతుతో లభించిన విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, ప్రజలు అప్పగించిన గొప్ప బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు మీపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా, ప్రతి గడపకు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా అంకితభావంతో పని చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడురాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, ఉపసర్పంచ్ తారక వెంకన్న యాదవ్, ఆనంద్ సాగర్, వెంకటరత్నం, మన్యం సాగర్, చంద్రశేఖర్, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు IMG-20251218-WA0045

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది