సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం

మందుముల పరమేశ్వర్‌రెడ్డి

సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం

ఉప్పల్, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

సీఎంఆర్ఎఫ్ పేదలు, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ కింద వైద్య బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరమేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మికి రూ.26 వేలు, సహినా సుల్తానాకు రూ.57 వేలు, నరసింహకు రూ.25 వేలు, సక్కుబాయి తరణికి రూ.41 వేలు చొప్పున మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చెన్‌రెడ్డి రఘుపతి రెడ్డి, ఆగం రెడ్డి, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎండి.రఫిక్, హెచ్.ఆర్.మోహన్, బజార్ నవీన్ గౌడ్, బుల్లెట్ అశోక్, అఫ్జల్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ