కాజీపేటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

కాజీపేటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
సమావేశంలో మాట్లాడుతున్న ధర్మారావు

 కాజీపేట డిసెంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)

 రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కాజీపేట లో పలుచోట్ల శనివారం ఘనంగా నిర్వహించారు. రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ కుర్సపల్లి రవీందర్ ఆధ్వర్యంలో కాజీపేట జంక్షన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మార్తినేని  ధర్మారావు, ప్రొఫెసర్ బన్న ఐలయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ను నేడు ప్రపంచం అంతట కీర్తింపబడుతున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని సింబల్ ఆఫ్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా  ప్రపంచం అంతట జరుపుకోవడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కొత్త రవి, స్టేషన్ మేనేజర్ స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ కాజీపేట జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ సిసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాధవరావు, చంద్రశేఖర్, ఇంజమని శారద, తిరుపతి లు పాల్గొన్నారు. 47వ డివిజన్ బాపూజీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇప్ప  శ్రీకాంత్ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ షేక్ మైసారపు సిరిల్ లారెన్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరిల్ లారెన్స్ మాట్లాడుతూ దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పని చేసి అంటరానితనం కులవివక్షత నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోల్కొండ రాంబాబు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొమురవెల్లి రమేష్, తమ్ముడి మధు, దొంగల కుమార్ యాదవ్, బర్ల రాజకుమార్, తిరుపతి శ్రీను, నీలం భానుచందర్ , ఇమ్మడి రవి, వెంపటి నాగ మహేష్, ఎండి మదర్ లు పాల్గొన్నారు. డీజిల్ కాలనీ చౌరస్తాలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దళిత రత్న పసునూరి మనోహర్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరారు. అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి అనే కొనియాడారు. మతోన్మాదులు అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రూపుమాపే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దానిని అంబేద్కర్ వాదులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే అంబేద్కర్ వాదుల చే చే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాణి రుద్రమదేవి అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ నాయకుడు బాదావత్ రాము, కొమురవెల్లి శ్రీనివాస్, ఉడుతల బాబురావు, కేశబోయిన రమేష్, కార్మిక నేత సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, నేతాజీ ప్రభాకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ