ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిషోర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్

ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిషోర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిషోర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణపురిలో వారి నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గాదరి కిషోర్‌ను శాలువాతో సత్కరించి, భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం బాణాసంచా కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కొకొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, బాలు తదితరులు పాల్గొని గాదరి కిషోర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా ఉద్యమంలో ఆయన చేసిన సేవలను ఈసందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. IMG-20251217-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .