హకింపేట్ స్పోర్ట్స్ స్కూల్‌పై ఆకస్మిక తనిఖీ
బాలల హక్కుల కమిషన్ గోగుల సరిత
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, డిసెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
హకింపేట్ స్పోర్ట్స్ పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న దాదాపు 450 మంది బాలురు, బాలికలుతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనపు నాణ్యత, వసతి, క్రీడా అభ్యాస సదుపాయాలు, దైనందిన నిర్వహణపై సరిత వివరాలు సేకరించారు. పిల్లల అభ్యాసం, క్రమశిక్షణ, వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా విచారించారు.ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ—స్పోర్ట్స్ స్కూల్స్ ప్రధాన లక్ష్యం పిల్లలను మానసికంగా, శారీరకంగా దృఢంగా తీర్చిదిద్డు, రాష్ట్రం తరుపున ప్రతిభ చూపగల మంచి క్రీడాకారులుగా నిలిపే బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యార్థు ల పట్ల ప్రత్యేక శ్రద్ధ, తగిన పోషణ, సురక్షిత వాతావరణం కల్పించడంలో నిర్వాహకులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరిశీలన అనంతరం సంబంధిత అధికారులకు ఆమె కొన్ని మార్గదర్శకాలు, సూచనలు అందించారు.


Comments