జిల్లా పరిషత్ భవనంలో అదనపు నిర్మాణాల పైఅంచనాలుపంపాలని అధికారులకు ఆదేశం

జిల్లా కలెక్టర్ మను చౌదరి

జిల్లా పరిషత్ భవనంలో అదనపు నిర్మాణాల పైఅంచనాలుపంపాలని అధికారులకు ఆదేశం

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయ భవనాన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు కేటాయించే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ భవనంలోని మొదటి అంతస్తులో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడం, పక్కనే ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని మండల తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించే ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించారు.అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో ని రెండో అంతస్తు భవనంపై పైకప్పు స్లాబ్ నిర్మాణానికి అయ్యే వ్యయంపై అంచనాలు తయారు చేసి నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ ఏఈను ఆదేశించారు. పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో జీ ప్లస్ వన్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన వ్యయ అంచనాల నివేదికను కూడా పంపాలనిసూచించారు. IMG-20251217-WA0076ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ కాంతమ్మ కార్యాలయ గదులు, మీటింగ్ హాళ్లు, సమీపంలోని ఖాళీ స్థలాన్ని కలెక్టర్‌కు చూపించి వివరించారు. అనంతరం కలెక్టర్ శామీర్‌పేట్‌లోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్