చర్లపల్లి డివిజన్ మార్పులపై కాప్రా సర్కిల్ డీసీకి వినతి

చర్లపల్లి డివిజన్ మార్పులపై కాప్రా సర్కిల్ డీసీకి వినతి

_బీఎన్ రెడ్డి నగర్,మహలక్ష్మి నగర్, భరత్ నగర్‌లను చర్లపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలి

చర్లపల్లి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

చర్లపల్లి డివిజన్ పరిధిలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్, మహలక్ష్మి నగర్, భరత్ నగర్ ప్రాంతాలను యథాతథంగా చర్లపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని అల్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపిస్తూ కాప్రా సర్కిల్ డీసీ జగన్, డీసీపీ కృష్ణమోహన్‌లకు వినతిపత్రం అందజేశారు. గతంలో చర్లపల్లి డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలను నూతనంగా ఏర్పాటు చేసిన చక్రీపురం, శక్తి సాయి నగర్ డివిజన్లలో విలీనం చేయడం వల్ల ప్రజలకు పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు వివరించారు.డివిజన్ మార్పుల కారణంగా మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతున్నాయని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించి సంబంధిత ప్రాంతాలను మళ్లీ చర్లపల్లి డివిజన్‌లో కొనసాగించాలని వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో అల్ పార్టీ నాయకులు రుద్రగోని రాంచందర్ గౌడ్, బూడిద శ్రావణ్ కుమార్ గౌడ్, గడ్డం యాదగిరి, కొమ్ము నర్సింగ్ రావు, బిజ్జ ఆనంద్ రాజ్ గౌడ్, పల్లపు మల్లేష్, పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్