నాచారం బుడగ జంగాల స్మశానవాటిక అభివృద్ధి పనులును పర్యవేక్షణ
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని బుడగ జంగాల స్మశానవాటికలో రూ.54 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అధికారులు కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా స్మశానవాటికలో నిర్మించిన స్థలాల గదులు, బర్నింగ్ ప్లాట్‌ఫారం, వెయిటింగ్ హాల్‌లను పరిశీలించారు. స్మశానవాటికలో చిందరవందరగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పాములు వంటి ప్రమాదకర జీవులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.అలాగే స్మశానవాటికలో ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాలకు త్వరలోనే వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.స్మశానవాటిక అభివృద్ధిపై బుడగ జంగాల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం నియోజకవర్గంలోనే బుడగ జంగాల కులానికి ప్రత్యేకంగా స్మశానవాటిక ఉండడం, అది కార్పొరేటర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, ఏఈ వినీత్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, లడ్డు శివ, నరసింహ, అంజయ్య, కృష్ణయ్య, రాము, శంకర్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments