రేవంతన్న సర్కార్ అండతో మల్లాపూర్ అభివృద్ధికి మరింత కృషి

నెమలి అనిల్ కుమార్

రేవంతన్న సర్కార్ అండతో మల్లాపూర్ అభివృద్ధికి మరింత కృషి

మల్లాపూర్, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

ముఖ్యమంత్రి రేవంతన్న సర్కార్ సహకారం తో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి చొరవతో మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి దిశగా మరింత ముందడుగు పడుతోందని నెమలి అనిల్ కుమార్ అన్నారు.మల్లాపూర్ డివిజన్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి భవాని నగర్ కమాన్ వరకు సుమారు రూ.52 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమ కృతజ్ఞతను చాటుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, అలాగే పరమేశ్వర్ రెడ్డి కి స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓల్డ్ మల్లాపూర్, భవాని నగర్ కాలనీ, పఠాన్ బస్తి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.జి. సుదర్శన్, దంతూరి రాజు, కప్పర సాయిగౌడ్, తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, కోయలకొండ రాజేష్, కోయగూర బాలరాజ్, ప్రభాకర్రెడ్డి,IMG-20251216-WA0043 సురేష్ గౌడ్, ఎస్.వి. కిట్టు, ఫసుద్దిన్, జానీ భాయ్, పర్వతాలు, వి. శ్రీనివాస్, మహేష్ నాయక్, రుపేందర్ రెడ్డి, ఫిరోజ్, రవి, యాది, జయంత్ గౌడ్, వంగవీటి రింకు, వినేష్ యాదవ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.అలాగే మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు జమీలా బేగం, నిర్మల రెడ్డి, శైలజ గౌడ్, ఇష్రాత్ భానో, ఇంతియాజ్, లావణ్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్