అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధి ఇంద్రనగర్ చౌరస్తాలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి, అలాగే రాజీవ్‌నగర్, కైలాసగిరి కాలనీలలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుదాస్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటంతో చెరగని ముద్ర వేశారు మహానీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. భారత సామాజిక వ్యవస్థను సవివరంగా అధ్యయనం చేసి, జాతీయోద్యమ లక్ష్యాలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని పేర్కొన్నారు.అంబేద్కర్ సేవలు, ఆలోచనలు మానవమర్యాద కోసం, అంతరాల లేని సమాజ నిర్మాణం కోసం, దోపిడీ వ్యవస్థల నిర్మూలన కోసం చేసిన నిరంతర కృషి ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో అంబేద్కర్ అభిప్రాయాలు, ఆయన ప్రతిపాదించిన ప్రకరణ–3 తెలంగాణ పోరాటానికి తాత్విక బలం ఇచ్చాయని తెలిపారు.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని, ఆయన చూపిన దారిలోనే నడుస్తామని ప్రభుదాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాకాల ఎల్లయ్య, యాదగిరి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, బాలరాజు, సామ్‌సన్, రామ్‌దాస్ నాయక్, రాజు, జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments