మర్రిపెల్లి అనిత అభ్యర్థిత్వాన్ని బలపరిచిన జనసేన
ధర్మసాగర్,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న విద్యావంతురాలు మర్రిపెల్లి అనిత విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని జనసేనపార్టీ తరుపున బలపరుస్తున్నట్లు పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గాదె పృథ్వీ ప్రకటించారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని నిస్వార్ధంగా ముందుకు వచ్చిన సామాన్య గృహిణి, చదువుకున్న మహిళ మర్రిపెల్లి అనిత ను గెలిపించాలని కోరారు.సామాన్యులకు ఎల్లప్పుడూ జనసేనపార్టీ అండగా ఉంటుందన్నారు.యువతతో పార్టీ సంస్థగతంగా బలపడుతుందని వ్యాఖ్యనించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనితకు జనసేనపార్టీ తోడుగా ఉంటుందన్నారు.జనసైనికులు మర్రిపెల్లి అనిత గెలుపుకు కృషి చేయాలని ఆదేశించారు.వార్డు సభ్యురాలిగా సేవలందించి ప్రజల మన్నెలు పొందిన అనితను గ్రామ సర్పంచ్ గా అత్యంత మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలన్నారు. గ్రామ ప్రజలు చదువుకున్న వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.


Comments