మాక్రో మీడియా డిజిటల్ ఎంపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
కీసర, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
మాక్రో మీడియా డిజిటల్ ఇమేజింగ్ సంస్థలో ఉద్యోగుల ఉత్సాహానికి, టీమ్ స్పిరిట్‌కు నిలువెత్తు నిదర్శనంగా ఎంపిఎల్ క్రికెట్ లీగ్‌ను సంస్థ నిర్వహించింది.ఈ టోర్నమెంట్ లో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు చురుకుగా పాల్గొని తాము కలిగిన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు.సంస్థ డైరెక్టర్లు శ్రీ రామకృష్ణ, శ్రీ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లీగ్ గేమ్స్‌లో అన్ని జట్లు పరస్పరం పోటీ పడుతూ వినోదాత్మకంగా సాగాయి. ఎంపిఎల్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిర్వాహక కమిటీ సక్రమంగా ఏర్పాట్లు చేసి ఈ క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ—“ఉద్యోగ విరామంలో వినోదంతో పాటు ఆరోగ్యానికి దోహదపడే ఈ రకమైన కార్యక్రమాలు మాకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు” అని తెలిపారు.మేనేజింగ్ డైరెక్టర్లు తమ బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించి ఉద్యోగులకు ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.క్రికెట్ లీగ్ ముగింపులో విజేత జట్లకు ట్రోఫీలతో పాటు ప్రత్యేక మొమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఉద్యోగులందరూ భాగస్వామ్యం అవుతూ ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.


Comments