బేతుపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రభంజనం.!

బేతుపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రభంజనం.!

సత్తుపల్లి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు) ఘన విజయాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొని ఆయన 1100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా, గ్రామంలోని మొత్తం 12 వార్డులను తన పక్షాన కైవసం చేసుకోవడం ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పార్టీ టికెట్ లభించకపోయినా, ప్రజల మధ్య ఉండే నాయకుడిగా పేరుపొందిన రాజేంద్ర ప్రసాద్‌పై గ్రామ ప్రజలు అపార విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన, గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ప్రచారానికి ప్రజలు తమ ఓటుతో స్పష్టమైన మద్దతు పలికారు.

డబ్బు, పార్టీ ప్రభావాలకు లోబడకుండా స్వతంత్ర ఆలోచనతో ఓటు వేసిన బేతుపల్లి ప్రజలు ఈ ఎన్నికల్లో నిజాయితీ రాజకీయాలకు పట్టం కట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం గ్రామ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందని, భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని వారు పేర్కొంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .