ఆసక్తికరంగా మారిన మద్దిగట్ల పంచాయతీ వార్

1705 ఓటర్లకు 9 మంది సర్పంచ్ అభ్యర్థులు

ఆసక్తికరంగా మారిన మద్దిగట్ల పంచాయతీ వార్

పెద్దమందడి,డిసెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది.ఎవరికి వారు యమున తీరలాగా ఉన్నారు.పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ పంచాయతీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ 1705 ఓట్లు ఉండగా, సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏకంగా తొమ్మిది (9) అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడ్డారు.నువ్వా - నేనా అంటూ పోటీ.పెద్దమందడి మండలంలో స్వల్ప అధిక ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీలలో మద్దిగట్ల కూడా ఒకటి. ఇక్కడ ఏ మాత్రం కూడా తీసిపోని విధంగా ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి అభ్యర్థులు మద్దతిస్తున్న, అధిక సంఖ్యలో సర్పంచ్ అభ్యర్థులు 
గెలుపు ముఖ్య కీలకం. ఓట్ల చీలిక అంశం సర్పంచ్ అభ్యర్థినీ ప్రభావితం చేసేలా ఉందనీ అనడంలో అతిశయోక్తి లేదు.అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల,ఓట్లు ఎక్కువగా చీలిపోయే అవకాశం ఉంది.దీంతో స్వల్ప ఆధిక్యంతో గెలుపోటములు నిర్ణయించే అవకాశం ఉంది.లేకపోతే యువత ఓట్లు చీల్చి దాదాపు 350 పై చీలుకు ఓట్లు ఓటర్ల ద్వారా రాబడితే గెలుపు దిశలో ఉంటారని ఓటర్లు ఆకాంక్షిస్తున్నారు.గ్రామ ప్రధాన సమస్యలు గ్రామంలో 11 కేవీ విద్యుత్ వైర్ల వల్ల కాలనీవాసులకు సమస్యగా మారడం, గ్రామ వైకుంఠ ధామం వర్షాకాలంలో చనిపోయిన వారిని పూడ్చడానికి చెరువు నీళ్ల వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉండడం,చెత్త డంపింగ్ యార్డు శాశ్వత రాకపోకల మార్గానికి పరిష్కారంగా ప్రధాన సమస్యలుగా గ్రామంలో నెలకొన్నాయి.అభ్యర్థులు వీటిని దృష్టిలో ఉంచుకోని ప్రచారంలో ప్రజలకు వారు గతంలో చేసిన సేవలు ముందు చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.మద్దిగట్ల గ్రామ జనాభాలో 1705 ఓట్లు వున్న వారిలో యువత ఓటు బ్యాంకు అధికం ఉండడం చేత వారి   ఓట్లు ఎవరు చీల్చి అధిక ఓట్లు తెచ్చుకోగలుతారో వారి ఓట్లే గెలుపునకు కీలకంగా కానున్నారు. ఈ ఎన్నికల్లో మద్దిగట్ల గ్రామ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఈ తొమ్మిది మంది సర్పంచ్ అభ్యర్థుల బరిలో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడానికి అదృష్టవంతులు ఎవరో తేలాలంటే ఎన్నికల జరుగు రోజు వరకు వేచి ఉండక తప్పదు.మద్దిగట్ల గ్రామ పంచాయతీ ఫలితాలు గ్రామ రాజకీయాలు పెద్దమందడి మండలంలో గ్రామంలో సర్పంచ్ పీఠం అందరిని ఆసక్తి రేపుతూ ఒకే సారి సర్పంచ్ పీఠానికి 19 మంది పోటీ చేయగా నేడు 9 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది