అంబర్‌పేట్‌లో 63వ హోం గార్డ్స్ రైజింగ్ డే వేడుకలు
Views: 5
On
అంబర్‌పేట్, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
అంబర్ పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో 63వ హోం గార్డ్స్ రైజింగ్ డే వేడుకలను డీసీపీ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం గార్డుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 6న హోం గార్డ్స్ రైజింగ్ డేను నిర్వహిస్తారని డీసీపీ పేర్కొన్నారు. 1946లో స్థాపించబడిన హోం గార్డ్స్ వ్యవస్థ ప్రజల రక్షణ, పోలీసు మరియు సాయుధ దళాలకు సహకారం, విపత్తుల నిర్వహణలో అమూల్యమైన సేవలను అందిస్తూ ఉందని శ్యాంసుందర్ అన్నారు.అంతర్జాతీయ విపత్తు చర్యలలో కూడా హోంగార్డులు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని ఈ సందర్భంగా డీసీపీ శ్లాఘించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు హోంగార్డులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 22:44:06
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...


Comments