అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి కార్పొరేటర్ బన్నాల నివాళి
చిల్కానగర్ , డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా చిల్కానగర్ డివిజన్‌లో కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్, ముదిరాజ్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. చిల్కానగర్ షెడ్యూల్ కులాల సేవాసంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాట యోధుడైన డాక్టర్ అంబేద్కర్ దళిత–బహుజన సమాజ అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు అంబేద్కర్ చేసిన కృషి యుగయుగాలు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తుందన్నారు.సామాజిక దాస్యాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం ఈ తరానికి దిక్సూచి అని, బాబా సాహెబ్ చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఈకార్యక్రమంలో చిల్కానగర్ షెడ్యూల్ కులాల సేవాసంఘం అధ్యక్షులు కొండ్ర రాములు, కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, మాస శేఖర్, బలరాం, చేర్యాల శ్రీనివాస్, యాదగిరి, సుందర్, రవీందర్ గౌడ్, మహమూద్, శ్రీశైలం, శ్రీనివాస్ యాదవ్, ఎండి హనీఫ్, ఎండి షఫీ, ముద్రం శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్, పార్నంది నర్సింగ్ రావు, డాక్టర్ అశోక్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments