వైకల్యం గెలుపుకు అడ్డు కాదు.
ఐఇడి కో-ఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి,మండల విద్యాధికారి ఏ.శ్రీనివాస్.
హాసన్ పర్తి, డిసెంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని భీమారం హైస్కూల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఏ. శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందడుగువేస్తున్నారని,విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐఇడి కో-ఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి,దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బిల్ల మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి భీమారంలో భవిత సెంటర్ ను త్వరలో ప్రారంభిస్తున్నామని,సెంటర్ ద్వారా విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని,వైకల్యం గెలుపుకు అడ్డు కాదని అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు వైకల్యం ఉన్నదని దిగులు చెందకుండా వారిని అనునిత్యం గమనిస్తూ, ప్రోత్సాహం అందించినట్లయితే వారికి భవిష్యత్తు మెరుగుపడుతుందన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రముఖ కవయిత్రి మాదారపు వాణిశ్రీ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముచ్చర్ల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రామిడి రవీందర్, చింతగట్టు హైస్కూల్ హెడ్మాస్టర్ పద్మ, ఫిజియోథెరపిస్టు మాధవి,దేవా జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డీ,స్థానికి పాఠశాల ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు దేవేందర్, ఐఇడి టీచర్స్ మమత,వీరస్వామి,ఉపాధ్యాయులు జహంగీర్, స్వరూప,సులోచన,సమ్మయ్య,వెంకటేష్,శ్రీను,రమేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments