బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
మౌలానా అబ్దుల్ బాసిత్ అన్వర్' ఫెలోషిప్ ప్రారంభం
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి అత్యవసరమని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు జనాబ్ ముహమ్మద్ అజ్ హరుద్దీన్ అన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర శాఖ ప్రకటించిన ‘మౌలానా అబ్దుల్ బాసిత్ అన్వర్ జర్నలిజం ఫెలోషిప్ 2025’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనాబ్ ముహమ్మద్ అజ్ హరుద్దీన్ మాట్లాడుతూ, నేటి సమాజంలో జర్నలిజం రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, నైతిక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు విద్యార్థులను ప్రేరేపించడమే ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. యువ జర్నలిస్టులు సమాజ హితాన్ని కాంక్షిస్తూ తమ వృత్తిని మలచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అర్హతలు - దరఖాస్తు వివరాలు: జె.ఐ.హెచ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఎం. ఫసిఉల్లా ఫెలోషిప్ నిబంధనలను వివరించారు:
అర్హత: తెలంగాణలోని కాలేజీలు, వర్సిటీల్లో జర్నలిజం (యూజీ, పేజీ, డిప్లొమా) చదువుతున్న ముస్లిం విద్యార్థులు. కనీసం ఒక సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఫెలోషిప్ అందజేస్తారు.
గడువు: ఆసక్తి గలవారు డిసెంబర్ 31, 2025 లోపు క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలకు: 9948011372 నంబర్‌ను సంప్రదించగలరు.


Comments