గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి 

ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి 

స్టేషన్ ఘనపూర్, డిసెంబర్/6, తెలంగాణ ముచ్చట్లు 

చిల్పూర్ మండలంలోని మల్కాపూర్, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, వెంకటాద్రిపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

“ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి సంబంధించినవి… మన గ్రామాభివృద్ధి మన చేతుల్లోనే ఉంది”

ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని, గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామ అభివృద్ధి ఆగిపోతుందని, ప్రభుత్వం, ఎమ్మెల్యేతో అనుసంధానం లేకపోతే పనులు సక్రమంగా జరగవని తెలిపారు. మద్యం, డబ్బులకు ఆశపడి గ్రామాన్ని ఆగం చేసుకోవద్దని, పని చేసే వారినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ–అభివృద్ధి పథకాలు

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, రైతులకు 21వేల కోట్ల రుణమాఫీ, 9రోజుల్లో 9వేల కోట్ల పెట్టుబడి సాయం, సన్నానికి 500 రూపాయల బోనస్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి కీలక పథకాలను గుర్తుచేశారు.

గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులే అవసరమని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి చేసిన హామీలు

మల్కాపూర్ – మండల కేంద్రం హామీ

మల్కాపూర్ గ్రామానికి ప్రత్యేకత ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి లావణ్య మల్లారెడ్డిను గెలిపిస్తే:

గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేలా ప్రయత్నం

ఇప్పటికే ₹66 లక్షల అభివృద్ధి

గెలిస్తే ₹1 కోటి అభివృద్ధి నిధులు

50 ఇందిరమ్మ ఇళ్లు

గండి రామారం లిఫ్ట్ పూర్తి చేసి గోదావరి జలాలు అందజేయడం

లింగంపల్లి – ₹1 కోటి అభివృద్ధి హామీ

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బండి స్వప్నను గెలిపిస్తే:

లింగంపల్లి గ్రామాన్ని ₹1 కోటి రూపాయలతో అభివృద్ధి

ఇప్పటికే ₹74 లక్షల అభివృద్ధి పనులు

రెండో విడతలో 40 ఇందిరమ్మ ఇళ్లు

లిఫ్ట్ పూర్తిచేసి రెండు పంటలకు సాగునీరు


నియోజకవర్గంలో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం ప్రజల నమ్మకానికి నిదర్శనం అని చెప్పారు.

శ్రీపతిపల్లి – అభివృద్ధి బాధ్యత నాది

కాంగ్రెస్ అభ్యర్థి రంగు రమేష్ను గెలిపించాలని కోరుతూ:

గ్రామ అభివృద్ధి బాధ్యత స్వయంగా తీసుకుంటానని హామీ

ఇప్పటివరకు ₹1.70 కోట్లు ఖర్చుతో అభివృద్ధి

లిఫ్ట్ పనులు పూర్తి చేసి చెరువులు నింపి సాగునీరు అందజేయడం

మాయ మాటలు నమ్మవద్దని సూచన

కొండాపూర్ – అన్ని రకాల అభివృద్ధి హామీ

కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ కిమాన్ను గెలిపిస్తే:

గ్రామాన్ని అన్ని విధాలాగా అభివృద్ధి చేసే బాధ్యత

ఇప్పటికే ₹53 లక్షల అభివృద్ధి

₹2.50 కోట్లతో నిర్మాణంలో ఉన్న సబ్-స్టేషన్ ద్వారా విద్యుత్ సమస్య పరిష్కారం

లిఫ్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందజేయడం


వెంకటాద్రిపేట – అన్ని సమస్యల పరిష్కార హామీ

కాంగ్రెస్ అభ్యర్థి దేవి మంజులను గెలిపిస్తే:

గ్రామ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది

కమ్యూనిటీ హాల్, సిసి రోడ్లు నిర్మాణం

గ్రామ చెరువు నింపి రెండు పంటలకు సాగునీరు

నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ₹1400 కోట్లు మంజూరు చేయించానని వివరించారు


ఇతర పార్టీల అభ్యర్థుల మాయ మాటలను నమ్మవద్దని, గ్రామ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ సమావేశాలలో గ్రామ సర్పంచులు, వార్డు అభ్యర్థులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియుగ్రామ ప్రజలు పాల్గొన్నారు. IMG-20251206-WA0061IMG-20251206-WA0060

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది