వెల్టూర్ 9వ వార్డులో ఇంటింటి ప్రచారంతో జనాన్ని ఆకట్టుకుంటున్న స్వతంత్ర అభ్యర్థి బండి అనిత

వెల్టూర్ 9వ వార్డులో ఇంటింటి ప్రచారంతో జనాన్ని ఆకట్టుకుంటున్న స్వతంత్ర అభ్యర్థి బండి అనిత

పెద్దమందడి,డిసెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామ 9వ వార్డుస్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి అనిత మంగళవారం వార్డులో ఇంటింటి తిరిగి ప్రజలను కలుసుకుని తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించుకున్న ఆమె, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రచార సమయంలో అనిత మాట్లాడుతూ..ఈ వార్డులో అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మత్తులు, కాల్వల శుభ్రత, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల, స్మశాన వాటికకు శాశ్వత పరిష్కారం, సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తాను. ప్రతి కాలనీకి శాశ్వత శుభ్రత సిబ్బంది, రెగ్యులర్ గార్బేజ్ కలెక్షన్, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. మురికివాడల అభివృద్ధి, శుద్ధి నీటి సరఫరా, పార్కుల అభివృద్ధి, యువత కోసం క్రీడా సదుపాయాల మెరుగుదల ఇవన్నీ నా ప్రణాళికల్లో భాగం అని వివరించారు.ఇంటి ఎదుటకు వచ్చి అభివాదం చేసిన స్థానికులతో ఆమె హృదయపూర్వకంగా మాట్లాడి తమ అవసరాలు, సమస్యలను నేరుగా వినుకున్నారు. ప్రజలు కూడా ఆమెకు మంచి స్పందన ఇస్తూ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనితకు తమ మద్దతు ప్రకటించారు.వార్డు అభివృద్ధి కోసం నిజంగా కష్టపడే వ్యక్తి అవసరం. నేను అందరి మాట వింటాను, నేను అందరి కోసం పనిచేస్తాను. గ్యాస్ పొయ్యి గుర్తు నా గుర్తు. దయచేసి గ్యాస్ పొయ్యి గుర్తుకే ఓటు వేసి నాకు అవకాశం ఇవ్వండి, అని ఆమె ప్రజలను అభ్యర్థించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది