లయన్స్ క్లబ్ సేవలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి
Views: 5
On
ధర్మసాగర్,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ హనుమకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, తెలుగు–ఆంగ్ల నిఘంటువులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు కిరణ్మయ కర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ బాధ్యులు రమణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి విద్యా సహాయ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కవిత, సురేష్, రామకృష్ణ, రమ్యశ్రీ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 20:10:07
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల


Comments