ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం స్పెషల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే బండారి 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం స్పెషల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే బండారి 

నాచారం, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉప్పల్ శాసనసభ్యులు  బండారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ బి. అజిత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఆయన వివరించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేందుకు వంట గదుల కొరత, మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అన్నపూర్ణ కాలనీలోని వెస్లీ హైస్కూల్ ఎయిడెడ్ పాఠశాలను పూర్తి స్థాయి ప్రభుత్వ పాఠశాలగా మార్పు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ పాఠశాల భవనం అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడినదని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నందున ఆ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమస్యలను ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పెషల్ సెక్రెటరీని కలిసి పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్