మృతుని కుటుంబానికి మేఘన్న అభయ హస్తం

మృతుని కుటుంబానికి మేఘన్న అభయ హస్తం

పెద్దమందడి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి హనుమంతు (తండ్రి: పెద్ద సాయన్న) బుధవారం రాత్రి 7 గంటలకు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000/-ల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధయ్య తిక్కన్న, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మధిర శ్రీశైలం, వార్డు సభ్యులు శంకర్, కృష్ణ, నరేష్, భాస్కర్, వెంకటయ్య, మన్యపు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది