కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
సీపీఐ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మౌలానా సంతాపం
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల సీపీఐ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. భూక్య వీరస్వామి ప్రజల మధ్య మన్ననలు పొందిన మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారని, పేదలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని మౌలానా గుర్తుచేశారు. ప్రజల కోసం, ప్రజల మధ్యనే జీవిస్తూ ప్రజా ఉద్యమాలకు బలమైన స్వరంగా నిలిచిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు.సామాజిక సేవతో పాటు క్రీడారంగానికీ ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, తన వంతు సహాయ సహకారాలు అందించి యువతకు దిశానిర్దేశం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు.కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆదర్శంగా నిలిచిన కుటుంబం భూక్య వీరస్వామిదని, ఆయన నలుగురు అన్నదమ్ములతో కలిసి చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగుతూ ఉద్యమానికి అంకితమయ్యారని తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల సీపీఐ ఖమ్మం జిల్లా దండి సురేష్, తాటి వెంకటేశ్వర్లు, సిబిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దంతాల బాలరాజు, మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణ, సిపిఐ కాకరవాయి గ్రామ కార్యదర్శి భూక్య శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జిల్లా వెంకన్న, ఒకటవ వార్డు సభ్యులు అన్నం రజిత,నల్లగట్టు సామేలు, వీరబోయిన మధు, నల్లగట్టు రవి, అన్నం రమణారెడ్డి,కొలిశెట్టి నర్సయ్య,కార్యకర్తలు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మౌలానా ఆకాంక్షించారు.


Comments