జమ్మిగడ్డ మెయిన్ రోడ్డులో వినూత్న పరిశుభ్రత కార్యక్రమం
నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో మలమూత్ర విసర్జన, చెత్త సమస్యకు పరిష్కారం
కాప్రా, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు)
కాప్రా మున్సిపాలిటీలో, కాప్రా డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మెయిన్ రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలి వద్ద మలమూత్ర విసర్జన, చెత్త వేయడంతో తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. ఈ ప్రాంతంలో ఒకవైపు వైన్ షాప్, మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్, ఎదురుగా సాంప్రదాయ హోటల్, టిఫిన్ సెంటర్లు, బస్ స్టాప్ ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో మంగళవారం రోజున డిప్యూటీ కమిషనర్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్), ఎల్‌బీ నగర్ – గోపాల్ రావు మరియు కాప్రా సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బంది ఒక వినూత్న పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, శానిటేషన్ జవాన్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దారు. భక్తి భావం పెంపొందించేలా పూజలు నిర్వహించి, భక్తి గీతాలు పాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ నినాదాలతో వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రఫిక్, అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు కలిసి దాదాపు 100 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ గోపాల్ రావు మాట్లాడుతూ, ప్రజలు మరియు వ్యాపారస్తులు తమ ఇళ్ల నుండి, వ్యాపార స్థలాల నుండి వెలువడే చెత్తను మున్సిపల్ ఆటోకే ఇవ్వాలని, రోడ్లపై చెత్త వేసినట్లయితే భారీ జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ జవాన్ ధర్మేందర్, కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఏ అంజలి, అరవింద్ ప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments