14వ తేదీ టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా మహాసభలు
జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మార్వో
మల్కాజ్గిరి, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు) :
మేడ్చల్ జిల్లా 3వ మహాసభను14 తేదీన జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పోస్టర్‌ను మల్కాజ్గిరి ఎమ్మార్వో కె.వి.ఎస్. సీతారాం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్‌కు అభినందనలు తెలియజేస్తూ, జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన గైడ్లైన్స్ తీసుకురావాలని కన్వీనర్ జి. హరిప్రసాద్ కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.జిల్లాలోని 700 మంది జర్నలిస్టుల సమస్యలపై చర్చించేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని జిల్లా కో-కన్వీనర్ పి. మల్లేష్ పేర్కొన్నారు.మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయంలో రవాణా సౌకర్యం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షులు జి. రోజా రాణి కోరారు.ఈ కార్యక్రమంలో రాజేందర్, సింగం రాజు, మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్, బాల కిషన్, మహేందర్ ఇతరులు పాల్గొన్నారు.


Comments