ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 

ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 

హన్మకొండ,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండలో ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రెస్‌మీట్, సెమినార్‌కు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జేఏసీ నాయకులు పెండ్యాల సుమన్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమాలు చేసి, ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని సుమన్ అన్నారు. అయితే రాష్ట్రం సాధించినప్పటికీ పేద ప్రజలకు, ఉద్యమకారులకు, సామాన్య ప్రజానీకానికి ఆశించిన ఫలితాలు అందడం లేదని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగిన ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు.

ప్రజలంతా భాగస్వాములై సాధించుకున్న స్వరాష్ట్రంలో ఇప్పుడు పెద్ద నాయకులు, ఉన్నతాధికారులు, ఆర్థిక బలమైన రాజకీయ వర్గాలు చొరబడి రాష్ట్రాన్ని దోచుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమకారులు, సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఉద్యమ కాలంలో కేసుల పాలై జైళ్లకు వెళ్లిన అనేక మంది ఉద్యమకారులు ఇప్పటికీ కేసుల వెంట తిరుగుతున్నారని, ఆమరణ, రిలే నిరాహార దీక్షలు చేసి ఆరోగ్యం కోల్పోయిన వారు నేటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.

ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి రోడ్డున పడ్డ ఉద్యమకారుల సంక్షేమాన్ని పట్టించుకునే నాయకత్వం రాష్ట్రంలో కనబడడం లేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలలో ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చేసిన హామీలు అమలుకాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే సామాన్య ప్రజల అభివృద్ధి, సామాజిక తెలంగాణ నిర్మాణం, వేలాది మంది ఉద్యమకారుల సంక్షేమం కోసం మరో ఉద్యమం అవసరమైందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో ఉద్యమకారుల సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించుకునేందుకు ఈ సెమినార్ వేదిక అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రఫుల్ రాం రెడ్డి సహా రాష్ట్ర నాయకత్వం హాజరవుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెండ్యాల సుమన్ పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ