ప్రపంచానికి రోల్ మోడల్‌గా గ్లోబల్ సమ్మిట్
అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)
రంగారెడ్డి జిల్లా కందుకూర్ ఫ్యుచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.దేశ
విదేశాల్లో వివిధ రంగాల్లో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించినట్టు తెలిపారు.గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 2037 విజన్, 2047 విజన్ అంశాలతో కూడిన ప్రభుత్వ లక్ష్యాలను సమ్మిట్‌లో వివరించనున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి దేశీయ రాష్ట్రాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమాన స్థాయి సాధించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థికవ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.సమ్మిట్ సందర్భంలో ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఎలాంటి అసౌకర్యం కలిగించబోదని, విదేశీ అతిథులకు ఏ సమస్య రాకుండా ముఖ్యమంత్రిప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.


Comments