సీతారామ కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు
చిల్కానగర్, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)
చిల్కానగర్ డివిజన్ సీతారామ కాలనీలో శిథిలావస్థకు చేరి ప్రమాదానికి గురిచేసే స్థితిలో ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి, నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్.
విద్యుత్ సమస్యపై కాలనీ ప్రజలు తెలియజేయగానే, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ వెంటనే స్పందించి సమస్యను విద్యుత్ శాఖ ఏఈ నిఖిల్ కి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఏఈ పాత స్తంభాలను తొలగించి కొత్త స్తంభాల ఏర్పాటుకు ముందుకొచ్చి పనులు పూర్తి చేశారు.ఈ సందర్భంగా నూతన స్తంభాలు ఏర్పాటు చేసి కాలనీకి భద్రత కల్పించినందుకు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కి సీతారామ కాలనీ అధ్యక్షులు గూడూరు రమేష్, సభ్యులు రామాంజనేయులు తదితరులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షులు గూడూరు రమేష్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, బరంపేట రమేష్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments