చిలుకటోనీ పల్లి అభివృద్ధే లక్ష్యం… సర్పంచ్ అభ్యర్థి పద్మా లింగేశ్వర్
దూకుడుగా ప్రచారం ఫుట్‌బాల్ గుర్తుకు ఊహించని ప్రజాదరణ
ఎమ్మెల్యే సహకారంతో విజయం సాధిస్తా..
పెద్దమంద,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
చిలుకటోనీ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థి పద్మా లింగేశ్వర్ ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచి ప్రజల మధ్య విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నారు. ఆదివారం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డిని కలిశారు. ఇంటింటా ప్రచారంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పద్మలింగేశ్వర్ కు ఎమ్మెల్యే సూచించారు. గ్రామాభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకున్న పద్మా లింగేశ్వర్, ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరుతున్నారు.ప్రచారానికి ఊహించని విధంగా వచ్చిన ప్రజాదరణతో పద్మా లింగేశ్వర్ హుషారులో ఉన్నారు. ప్రతి గడప వద్ద ప్రజలు చూపుతున్న ఆదరణ, విశ్వాసం తనకు గెలుపు సంకేతాలు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే మేఘా రెడ్డి అండగా ఉన్నందున విజయం తనవైపే అని ధీమా వ్యక్తం చేశారు.చీలకటోనీ పల్లిలో ఎన్నికల వేడి పెరగడంతో ప్రచార రంగంలో పద్మా లింగేశ్వర్ పేరు పెనుమార్పులు తెస్తోంది. ప్రజల మద్దతుతో, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గెలుపు ఖాయం అని పద్మలింగేశ్వర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 


Comments