వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం

వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం

కాప్రా, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

వాసవి మిత్ర మండలి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహించే అన్నదాన కార్యక్రమం శుక్రవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల కుషాయిగూడకు చెందిన పేద వృద్ధులకు ఆర్థిక సహాయం అందజేశారు. మాలే వరమ్మ, కొండూరి విజయ, తోడుపునూరి ఉమారాణి, పడకంటి కమలమ్మలకు చెరో రూ.1,000 చొప్పున పింఛన్ అందించారు.ఈ కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి అధ్యక్షులు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి రాముని తిరుమలేష్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త, ఉపాధ్యక్షులు నంగునూరి అశోక్ గుప్త, చెన్న చక్రపాణి గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, వైవియూ నాగేశ్వరరావు గుప్తతో పాటు పలువురు కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమావాస్య రోజున అన్నదానం, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.IMG-20251219-WA0090

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .