కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దిష్టిబొమ్మ దహనం
చర్లపల్లి, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
జీహెచ్ఎంసీ 16వ డివిజన్ అంశంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ శుక్రవారం చక్రిపురం సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు.చక్రిపురంలోని తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా చక్రిపురం కాలనీతో పాటు పరిసర కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 16వ డివిజన్ ఏర్పాటులో కార్పొరేటర్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.ఈ నిరసన కార్యక్రమంలో చక్రిపురం కాలనీ అధ్యక్షులు గడ్డల పాండు, ప్రధాన కార్యదర్శి సోమసాని అశోక్, గౌరవ అధ్యక్షులు మొగిలి రాఘవరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సహదేవ్ గౌడ్, లక్ష్మీ ప్రైడ్ అధ్యక్షులు ఆర్. సుధాకర్ రెడ్డి, టీచర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు నరసింహ గౌడ్, మారుతి కాలనీ గౌరవ అధ్యక్షులు మహేందర్, రమణ సీతారామ కాలనీ ఉపాధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్, సాయి కృష్ణ కాలనీ మురళి, మధుర నగర్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రమణ, చక్రిపురం ఉపాధ్యక్షులు డి.ఎం. కొండారెడ్డి, పి. భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, యాకయ్య, ఎర్రయ్య, చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాన్ సింగ్, రంజిత్ రెడ్డి, ముఖేష్ నాయక్, రమణ, బీజేపీ సీనియర్ నాయకులు, కాంటెస్టెడ్ కౌన్సిలర్ టి. వెంకట చారి తదితరులు పాల్గొన్నారు.


Comments