దమ్మాయిగూడలో ఉచిత వైద్య శిబిరం
దమ్మాయిగూడ, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో వెంకటేశ్వర నగర్ కాలనీలో (సౌత్ కమలానగర్) పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్, నవోదయ సంక్షేమ వేదిక మరియు సీఐటీయూ కీసర మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని దమ్మాయిగూడ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప రామారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, కార్మికుల కోసం సీఐటీయూ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ట్రస్ట్ మరియు సంక్షేమ వేదిక ద్వారా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పేదలు నివసించే ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి మందుల పంపిణీ చేయడం, అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం, కంటి అద్దాలను సరసమైన ధరలకు అందించడం గొప్ప కార్యక్రమమని అన్నారు.
దమ్మాయిగూడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఐటీయూ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షురాలు ఈగ శ్వేతా రాజు బ్రెస్ట్ క్యాన్సర్ స్కానింగ్ మెడికల్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని, దీనిని ఆదిలోనే గుర్తించి నివారించేందుకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఈగ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ సీఐటీయూ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూత అందిస్తామని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ వైద్యులు కంటి పరీక్షలు, సాకేత్ & దమ్మాయిగూడ పద్మసాయి డెంటల్ క్లినిక్స్‌కు చెందిన డాక్టర్ నిమిలే దినేష్ దంత పరీక్షలు, నాగారం ‘దియా’ స్కిన్ & హెయిర్ క్లినిక్ వైద్యులు చర్మ పరీక్షలు, సియాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్యులు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే నాగారం సహస్ర హోమియో క్లినిక్ డాక్టర్ విశ్వనాథ రెడ్డి సాధారణ


Comments