పామిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం
పెద్దమందడి,డిసెంబర్07( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజల్లో బలమైన నమ్మకం నెలకొల్పుతూ, సర్పంచ్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం ముమ్మర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని మంజుల హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యంపై దృష్టి, తాగునీటి సదుపాయాల మెరుగుదల, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలను కాంగ్రెస్ పాలనలో సాధించవచ్చని మంజుల శ్రీశైలం వివరించారు.ప్రజల మద్దతు, ఎమ్మెల్యే సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమాగా మధిర మంజుల శ్రీశైలం వ్యక్తం చేశారు. స్థానికులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటి ప్రచారం ద్వారా మంచి స్పందనను పొందుతున్నట్లు ఆమె తెలిపారు.ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణలు చేపడతానని మంజుల శ్రీశైలం హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments