వెల్టూర్‌ లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

ప్రజాస్వామ్య విలువలకు ఘన నివాళి

వెల్టూర్‌ లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

పెద్దమందడి,డిసెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశానికి యావత్ ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 70వ వర్ధంతి వేడుకలు పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువతులు, యువకులు, అలాగే స్థానిక ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వెల్టూర్ గ్రామస్థులు, డాక్టర్ అంబేద్కర్ చూపించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి సూత్రాలను స్మరిస్తూ, గ్రామాభివృద్ధికి ముందుగా సేవలో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్న అభ్యర్థులు, అంబేద్కర్ ఆదర్శాలు ప్రతి గ్రామస్తుల జీవితంలో మార్గదర్శకంగా నిలవాలని, సమాజం సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్, దయ్యాల రమేష్, మహేందర్, గుండెల ఆంజనేయులు, నాగభూషణ్, వెంకటేష్ (బజార్), శ్యాంసుందర్, పాముల రాములు, బండి ప్రవీణ్, ఏర్పుల రాములు, ఇరికిశెట్టి మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ