మోజర్ల బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నర్సింహారెడ్డి ఇంటింటి ప్రచారం
పెద్దమందడి,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నర్సింహారెడ్డి శనివారం గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వాడ, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..
గ్రామాభివృద్ధే మా లక్ష్యం. మేము చేసిన పనులను ప్రజలు గుర్తించి ఆశీర్వదిస్తున్నారని అనిపిస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, శుద్ధి నీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, గ్రామంలోని ప్రతి కుటుంబం అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంకల్పం ప్రజల ముందే ఉంది అని పేర్కొన్నారు.ఇదే సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను అభ్యర్థికి వివరించగా, అవి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments