బుచ్చిలింగం గెలుపు మదిగట్ల గ్రామ అభివృద్ధికి మలుపు
పెద్దమందడి,డిసెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామంలో కొనసాగుతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బుచ్చిలింగం గ్రామాభివృద్ధికి కొత్త దిశ చూపిస్తారని గ్రామస్తులు ఆశ చూపుతున్నారని అభ్యర్థి బుచ్చి లింగంఆశాభావంవ్యక్తంచేస్తున్నారు.గ్రామంలో అనేక సవాళ్లున్నప్పటికీ, కొందరు నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే సర్పంచ్ పదవిని ఆశిస్తున్నారని బుచ్చిలింగం విమర్శించారు. అయితే, తన ప్రధాన లక్ష్యం గ్రామస్థల సమస్యలను పరిష్కరించడం మరియు సత్వర అభివృద్ధికి దారి చూపించడం అని చెప్పారు.ప్రచారంలో బుచ్చిలింగం ఇంటింటి సందర్శనతో, గ్రామస్తులతో ప్రత్యక్షంగా కలిసిపని చేస్తూ, వారితో సమస్యలపై చర్చించడం, వారికి నే ఈ సమస్యకు సమాధానం ఇస్తాను అనే భరోసా ఇవ్వడం కీలకం అని తెలిపారు.గ్రామస్తులు, తారతమ్యాలు లేకుండా, నిజమైన సేవల ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడగల వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించాలని ముందుగా నిర్ణయించారు. వారు బుచ్చిలింగం గెలుపుతో మదిగట్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపు మరియు వాస్తవ అభివృద్ధి తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.శనివారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బుచ్చిలింగం, భారీ మెజార్టీతో గెలిచి మదిగట్ల అభివృద్ధికి తన వంతు సేవలందిస్తానని హామీ ఇచ్చారు.


Comments