కాప్రా డివిజన్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా  విద్యార్థుల ర్యాలీ

కూచిపూడి నృత్యం, గీతాలతో చెత్త రహితంపై అవగాహన

కాప్రా డివిజన్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా  విద్యార్థుల ర్యాలీ

కాప్రా, డిసెంబర్  19(తెలంగాణ ముచ్చట్లు):

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్ నోబుల్ స్కూల్ విద్యార్థిని–విద్యార్థులచే శుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెత్త ఎక్కువగా పడే మసీదు ఎదురుగా ఉన్న జివిపి పాయింట్ వద్ద కూచిపూడి సాంస్కృతిక కార్యక్రమం, స్వచ్ఛతపై పాటల ప్రదర్శన నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు చెత్తను రోడ్లపై పడవేయకుండా మున్సిపల్ శానిటేషన్ ఆటోలకు అప్పగించాలని, ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థిని–విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు, జవహర్ నగర్ పోలీస్ శాఖ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చిన బేబీ ప్రవళినీని సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ శాలువాతో పాటు పారితోషికం అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జవాన్ రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఏ కుమార్, వసంత, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .