80వ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

80వ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

-టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరేందర్ నాయక్ పిలుపు

వరంగల్,డిసెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

ఉపాధ్యాయులు కేవలం ఉద్యోగులు మాత్రమే కాక సమాజ నిర్మాణానికి పునాది వేసే శిల్పులని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరేందర్ నాయక్ అన్నారు. టీఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న 80వ వార్షికోత్సవ అభ్యుదయోత్సవ మహాసభను ఉపాధ్యాయులంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.1944లో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్యగా ప్రారంభమైన ఉపాధ్యాయ ఉద్యమం, చెన్నుపాటి లక్ష్మయ్య నాయకత్వంలో 1947లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్‌గా పునర్వ్యవస్థీకరించబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2న చారిత్రక మలుపు తిరిగిందని, దివంగత మార్పుబాలకృష్ణమ్మ ప్రేరణ, త్యాగం, అహర్నిశల కృషి ఫలితంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్యగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్‌గా సంఘం విభజింపబడిందని తెలిపారు.

గత 80 సంవత్సరాలుగా ఈ సంఘం ఉపాధ్యాయుల గౌరవం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం అవిరామంగా పోరాటం చేస్తోందని నరేందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం మానేటి ప్రతాపరెడ్డి, కటుకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి, సుంకెశీల ప్రభాకర్ రావు నాయకత్వంలో మరోసారి ఉపాధ్యాయ సంఘటిత శక్తిని చాటే సమయం వచ్చిందన్నారు.

టీఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే అభ్యుదయోత్సవ మహాసభ మన చరిత్రను స్మరించుకునే వేదికగా, మన ఐక్యతను చాటే సభగా, భవిష్యత్ దిశను నిర్దేశించే సంకల్పంగా నిలవనుందని తెలిపారు. హైదరాబాద్ నాగోల్‌లోని సాయిరాం ఉద్యానవనాల్లో ఈ నెల 21న జరిగే ఈ సభ త్యాగాల పండుగగా, దివంగత నాయకులకు నివాళిగా, ప్రస్తుతం సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుల కృషికి గుర్తింపుగా ఉంటుందని అన్నారు.ఉపాధ్యాయుల సౌకర్యార్థం నాలుగు విలాసవంతమైన బస్సులు, మహిళా ఉపాధ్యాయినిలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ సోదర సోదరీమణులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అభ్యుదయోత్సవాన్ని టీఆర్‌టీఎఫ్ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలపాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .