రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట
ఒలింపిక్స్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి
– మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఒలింపిక్స్ స్థాయి లక్ష్యంగా ప్రభుత్వము కృషి చేస్తోందన్నారు.ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్ యువసేన ఆధ్వర్యంలో నాచారం సీడీఎస్ బిల్డింగ్‌లో నిర్వహించిన 5వ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ అధ్యక్షుడు బండారి శ్రీకాంత్ గౌడ్, కృష్ణారెడ్డి, ప్రకాష్ రెడ్డి, హెచ్‌ఆర్ మోహన్, రామ్ రెడ్డి, నందికొండ కొండ శ్రీనివాస్ రెడ్డి, సెంట్ జాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి, ఇందిర స్కూల్ ప్రిన్సిపాల్ అన్వర్, రమణ రెడ్డి, నర్సింగ్ రావు, స్వామి, రమేష్ గౌడ్, వీ రాజు, రాజు రెడ్డి, నూతలకంటి రాజు, మహేష్ యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, నెమలి కొండ సునీల్ రెడ్డి, మహమ్మద్ అజీమ్, శ్రీమంత్ గౌడ్, గొల్లం నరేష్, జి రాకేష్, జి క్రాంతి కుమార్, సిహెచ్ నరేష్, రాజశేఖర్, సాహిద్, షరీఫుద్దిన్, ప్రవీణ్ గౌడ్, మధు గౌడ్, టోనీ ఫ్రాన్సిస్, రేవంత్, ఉమా, చందు తదితరులు పాల్గొన్నారు.


Comments