కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురావేయాలి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.
హాసన్ పర్తి,డిసెంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):
హాసన్ పర్తి మండల గ్రామ పంచాయతీలో రెండవ విడత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 15 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు.కొత్తపల్లి,అర్వపల్లి గ్రామాలలో గ్రామపంచాయతీ సర్పంచులను ఆరు వార్డు మెంబర్లను ఒక ఉప సర్పంచి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలను ఎమ్మెల్యే నాగరాజు తన సొంత నిధులతో మండల పార్టీ కాంగ్రెస్ నాయకులతో కలిసి అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తా ఏలాంటి సమస్యలు ఉన్న తనదృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మిగతా గ్రామాల్లో కూడా జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యాలకు గ్రామపంచాయతీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రభుత్వ పథకం ప్రజలకు అందని ద్రాక్షగానే టిఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిచ్చిందని కాంగ్రెస్ ప్రతి ఒక్క పథకం పేదలకు అందుతుందని మిగతా గ్రామ పంచాయతీలను కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి తోడ్పడుదామని పిలుపునిచ్చారు.


Comments