పాలేరూ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
దమ్మాయిగూడెం సరస్వతి విద్యాలయం క్యారెస్పాండెంట్ శ్రీనివాస్ కార్యదర్శిగా ఎంపిక.
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 6; తెలంగాణ ముచ్చట్లు;
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరంలోని ది మెరిట్ స్కూల్ లో జరిగిన సమావేశంలో పాలేరూ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా, సమగ్ర సమన్వయంతో జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కమిటీ లో అధ్యక్షుడిగా ముదిగొండ లిటిల్ ఇండియన్ స్కూల్ కు చెందిన శివకృష్ణ,కార్యదర్శిగా దమ్మాయిగూడెం శ్రీ సరస్వతి విద్యాలయం క్యారెస్పాండెంట్ శ్రీనివాస్,కోశాధికారిగా కూసుమంచి ప్రగతి స్కూల్ కు చెందిన సీతారాములు ఎంపికయ్యారు.పాలేరూ డివిజన్ లోని అన్ని ప్రైవేట్ పాఠశాలల మేనేజ్‌మెంట్లు పాల్గొని, పూర్తిస్థాయి ఐకమత్యంతో కమిటీని ఎన్నుకోవడం విశేషం.నూతన కమిటీ డివిజన్‌లోని విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.సమావేశానికి ఖమ్మం జిల్లా ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు గుర్రం కాంతారావు, కోశాధికారి వై నాసరయ్య ప్రత్యేక అతిథులుగా హాజరై, ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ, పాఠశాలల అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.


Comments