అంబేద్కర్ 69వ వర్ధంతి విగ్రహానికి కార్పొరేటర్ నివాళి
Views: 18
On
మల్లాపూర్, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి డా.బీ ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అంబేద్కర్ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, విద్య, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కర్రె శంకర్, మెండ రఘువరన్, పర్ణటీ నరేందర్, పిజి సుదర్శన్, హనుమండ్ల విజయ్, పర్ణటీ ప్రసాద్, జితేందర్, పేగుడా నర్సింహ, తునికి నర్సింహ, తునికి సురేష్, తునికి బాలచందర్, స్థానిక నాయకులు తిగుళ్ల శ్రీనివాస్, ఫైళ్ల ప్రవీణ్ కుమార్, శివ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments